మన జీవితంలో “స్వచ్చదనం పచ్చదనం” ఒక భాగం కావాలి- మంత్రి పొన్నం

మన జీవితంలో “స్వచ్చదనం పచ్చదనం” ఒక భాగం కావాలి- మంత్రి పొన్నం

మన జీవితంలో స్వచ్చదనం – పచ్చదనం ఒక భాగం కావాలి

స్వచ్చ ధనం – పచ్చదనం కార్యక్రమం లో రాష్ట్రం మొత్తం విధిగా పాల్గొనాలి

భవిష్యత్ తరాలు మనుగడ సాగించాలంటే మొక్కలు నాటాలి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలు పంచుకోవాలి

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్ ;

భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమం రెండవ రోజులో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కొత్త చెరువులో మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి పాల్గొన్నారు. కొత్త చెరువును పరిశీలించి చేయాల్సిన పనులు మరమ్మత్తులు తదితర అంశాలపై కలెక్టర్ తో కలిసి చర్చించారు. కొత్త చెరువును అభివృద్ధి చేయడానికి, బ్రిడ్జి నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… మనం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఎంత అవసరమో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. తాగే నీరు వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో పట్టణ ప్రజలంతా మొక్క నాటి కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. ఆడంబరాలకు పోకుండా పుట్టినరోజు, పెళ్లిరోజు, పెద్దల జ్ఞాపకార్థం మొక్కలు నాటి సంరక్షించుకున్నట్లయితే తగినంత స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. మలేరియా, డెంగ్యూ, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు మరెన్నో వింత వ్యాధులు వస్తున్న ఈ తరుణంలో ఆస్తులు అమ్ముకొని దవాఖానాలో పెట్టాల్సి వస్తుందని వీటిని పారద్రోలాలంటే ప్రజలంతా పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజల సహకారం  లేకుంటే విజయవంతం కావని తెలియజేస్తూ ప్రజలు ఇందులో మమేకం కావాలని కోరారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఉన్నప్పుడు మొక్కల విలువ తెలుసుకొని ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు.

ఈరోజు చెప్పలేని వింత వ్యాధులు వస్తున్నాయి. చిన్న తనం నుండే కిడ్నీ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. మనం వీలైనంత వరకు స్వచ్చమైన గాలి, తాగే నీరు, వాతావరణ కలుషితం, మనం తినే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజల సహకారం లేకుంటే కార్యక్రమాలు విజయవంతం కావు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, సలహాలు కూడా ఇవ్వచ్చని అన్నారు. పట్టణం లో పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గనుక వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించ కూడదని సూచించారు.

“స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమం నిరంతర ప్రక్రియ- జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సామాజిక బాధ్యతతో అందరూ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మన భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని కోరారు. ప్రజలలో పరిశుభ్రత మరియు పచ్చదనం పై అవగాహన పెంపొందించడం లో భాగంగా గ్రామపంచాయతీలు మరియు మున్సిపల్ వార్డులలో పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామని తెలిపారు.

నీరు నిల్వ ఉండడం మూలంగా త్రాగునీరు కలుషితం అయి డెంగ్యూ మలేరియా డయేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తాయని అందువల్ల నీరు నిలువకుండా మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలి అని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటికే 20 లక్షల మొక్కలు నాటామని ఈ ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత , మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *