సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీ రావు నిదర్శనం అని ఇంత ఉన్నత శిఖరాలకు ఏదిగిన రామోజీ రావు ఆదర్శ నీయుడు, వారి మరణాంపట్ల తీవ్ర సంతాపన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.రాబోయే తరానికి మార్గదర్శి రామోజీ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షానా వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
రామోజీరావు కి ఘనంగా నివాళులు అర్పిస్తూ..వారు పత్రికా రంగంలో, ,ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రాంతీయ జిల్లా వార్తల నుండి చారిత్రాత్మక వార్తల వరకు మార్గదర్శకం, శ్రమ పడితే అందుకోలేనిది ఏమి ఉండదని వ్యక్తి రామోజీ రావు, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారిని దగ్గరగా ఉండి చూసాను.. వారి జీవితం అదర్శమైంది..వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ ..వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.