తెలంగాణ సాయుధ పోరాట వీరుడు “మేర మల్లేశం” స్వీయ చరిత్ర ‘మేర మల్లేశం – పోరాట పాటలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు “మేర మల్లేశం” స్వీయ చరిత్ర ‘మేర మల్లేశం – పోరాట పాటలు’, మేర మల్లేశం జీవితం పై డా.కే ముత్యం సంపాదకుడ గా మరియు పరిశోధ సంపాదకుడు గా కవి అన్నవరం దేవేందర్ రాసిన మేర మల్లేశం పుస్తకాన్ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో మేర మల్లేశం పోరాటాన్ని గుర్తు చేసుకున్నా మంత్రి పొన్నం ప్రభాకర్, నేటి యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ హౌజ్ ఫేడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, స్థానిక తహసీల్దార్ రవీందర్ రెడ్డి, హుస్నాబాద్ పట్టణ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ మేరు తదితరులు పాల్గొన్నారు.