హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో తొలిసారి ఈరోజు జాబ్ మేళా ను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలి నేని మను చౌదరి, హుస్నాబాద్ ఆర్డిఓ వి. రామ్మూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా, మండల రెవెన్యూఅధికారులు, వివిధ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఈ జాబ్ మేళా ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో సున్నా నుండి పిజి వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని,విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి వివిధ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఉంటాయని, ఈరోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ జాబ్ మేళాకు కు వచ్చిన నిరుద్యోగులకు అన్ని రకాల వసతులు, భోజన వసతి ఏర్పాటు కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
అనంతరం వివిధ కంపెనీలలో ఎంపిక కాబడిన నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలను అందజేశారు.