పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం

పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం

ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగద్దు

కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు

డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు లేదు

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో భాగంగా పోతారం (ఎస్) లోని ఆర్ కే జిన్నింగ్ మిల్లు ( మీర్జాపూర్ రోడ్డు )  లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పత్తి తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… హుస్నాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని, కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యవేక్షణ లో దేశ వ్యాప్తంగా కాటన్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పత్తి మద్దతు ధర పత్తి కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయని, మౌలిక వసతుల కల్పన అడ్మినిస్ట్రేషన్ సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని నా దృష్టికి వచ్చిందని, కేంద్రంలో ఉన్న మన రాష్ట్ర ప్రతినిధులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 322 పత్తి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు క్రయ విక్రయాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ వరకు పత్తి కొనుగోలు కొనసాగుతుంది. రైతులు ఎవరూ తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్నారు. పత్తిలో తేమ శాతం 8 లోపు ఉంటే 7500 ధర ఉంటుందని, పత్తి ని సంచులలో నింపుకు రాకుండా ఓపెన్ గా ఆటోలో, ట్రాక్టర్, వ్యాన్ లో తీసుకురావాలని రైతులకు తెలియజేశారు. కనీస తేమ శాతాన్ని పాటించి ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలవద్దని అన్ని రకాలుగా పర్యవేక్షణ జరుగుతుందని, హుస్నాబాద్ ప్రాంతంలో అన్ని సెంటర్లలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ  జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయ్యాయి ఎంత కొనుగోలు జరిగింది అనే విషయాలపై మానిటరింగ్ జరుగుతుంది. గ్రామాలలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన ప్రభుత్వ అధికారులతో స్థానిక నాయకత్వాలు చర్చించి  రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీదే అని తెలిపారు.

వరి ధాన్యాన్ని సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. కోనుగోలు వేగంగా  జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల దగ్గర సేకరించిన వడ్ల పేరు మీద 20 వేల కోట్ల విలువైన  ధాన్యం ఇవ్వక డబ్బు కట్టక పెండింగ్ లో ఉంది. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల కేటాయింపు జరగలేదు. జీరో డ్యూ ఉండి ప్రభుత్వానికి మంచిగా చెల్లించిన వారి కేటాయింపు జరుగుతుంది అని తెలిపారు. మిల్లర్ల కేటాయింపు తో పాటు 60-70 శాతం మంచిగా చేసి వారికి 10 శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి  అవకాశం ఇస్తున్నాం అని, డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు చేయడం లేదన్నారు. మిల్లు కేటాయించలేదు అనే పేరు మీద ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆగదని, పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటామన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మన చౌదరి, హుస్నాబాద్ ఆర్ డి ఓ, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *