ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు.అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీ రావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత , క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని ఏ పని అయినా విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేశారన్నారు..తెలుగువారి సత్తా యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు అని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి ,రామోజీ సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Posted inతాజావార్తలు హైదరాబాద్
రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం





