ఉపాధి హామీ కూలీల మృతి పట్ల మంత్రి పొన్నం తీవ్ర ద్రిగ్బాంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాల పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఉపాధి హామీ లో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరణించిన ,గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు.