ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో డిపో రోడ్డులో శ్రీ భవాని స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన జరగాలని ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపల్, ప్రభుత్వ కార్యాలయాలు అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇందిరా శక్తి క్యాంటీన్ కు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ క్యాంటీన్ లకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మరియు వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుందని, శ్రీ భవానీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ ను హుస్నాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రజల అవసరాలకు అనుగుణంగా
మంచి నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. రుచికరమైన ఆహారపదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి , ఆర్థికంగా ఎదిగేలా తినడానికి సంబంధించిన అవసరాలు తీర్చే విధంగా ఈ క్యాంటీన్ లో ఉపయోగపడాలని, స్వప్న నేతృత్వంలో ఏర్పాటైన మహిళా క్యాంటీన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో శ్రీ ఆదర్శ ఎంటర్ ప్రైజెస్ ఎలక్ట్రిక్ బైక్ షో రూం ను ప్రారంభించి ఎలక్ట్రిక్ బైక్ కీ అందుకొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐయిలేని అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

