హుస్నాబాదులో మానవ వ్యర్ధాల శుద్ధికరణ ప్లాంటును ప్రారంభించిన మంత్రి పొన్నం
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, గాంధీ జంక్షన్ సుందరీకరణ పనులకు శ్రీకారం
గాంధీ జయంతి సందర్భంగా వికలాంగులకు స్కూటీలు అందజేత
పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ జంక్షన్ సుందరీకరణ కు శంఖు స్థాపన చేశారు. వికలాంగులకు స్కూటీ లను అందజేశారు. పర్యావరణ హితమే దేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తం సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ఒక కోటి పది లక్షల వ్యయంతో నిర్మించిన మానవ వ్యర్ధాల శుద్ధికరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఈ ప్లాంట్ ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దలని సూచించారు. నిండిన సెప్టిక్ ట్యాంకు లోని వ్యర్థాలతో ఎరువులు తయారు చేయడమే ఈ శుద్ధి ప్లాంట్ లక్ష్యమని తెలిపారు. మానవ వ్యర్థాల నుండి సాంకేతికంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఎటువంటి మందులు కలపకుండా ప్రకృతి విధానం లో పరిశుభ్రంగా చేసేలా fstp నీ ప్రారంభించుకున్నామని అన్నారు. దీని మీద ఎలాంటి అపోహలు అవసరం లేదని సాంకేతికంగా తెలిసిన వారు ఎవరు అపోహపడరన్నారు మానవ మల వ్యర్థాలు ఘన రూపంలో, ద్రవ రూపంలో ఉండవని ఇక్కడ ఎలాంటి వాసన రాదని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బయటి వాతావరణం అపరిశుభ్రమం అవుతుందని అపోహ వద్దనీ పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్లమ్మ చెరువు పక్కనే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంతమంతా హుస్నాబాద్ కేంద్రంగా టూరిజం అభివృద్ధి జరుగుతుందనీ పేర్కొన్నారు. పట్టణానికి అవసరమైన వ్యర్థాలు ఎరువులు ఇచ్చే విధంగా శుద్ధి చేసుకొని fstp కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. Fstp ఇక్కడికి తీసుకొచ్చిన వారికి పాలక మండలికి ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ ప్రజల డ్రైనేజీ , సమస్య , రోడ్లు సుందరీకరణ కూడా అన్ని పూర్తి చేస్తామన్నారు. గాంధీ జయంతి, వర్ధంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు ఒక సేవకులుగా నగర ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి మన నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారనీ వారిని అభినందించారు. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళకి పనిభారం తగ్గుతుందనీ సూచించారు. ప్రజలకు శుభ్రత పట్ల అవగాహన లేక మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది శ్రమపడుతున్నారనీ సేవకులను అందరం సన్మానం చేసుకోవాలన్నారు. 113 మంది మహిళలకు చీరలు, సిబ్బందికి బట్టలు అందజేయడ జరుగుతుందన్నారు. గత గాంధీ వర్ధంతి సందర్భంగా కూడా సిబ్బందిని సన్మనించుకున్నామని గుర్తు చేశారు. ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అన్ని రకాలుగా అందరి సహకారం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్, ప్రాజెక్టు ఆఫీసర్ రవికుమార్, మరియు కౌన్సిలర్సు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



