హుస్నాబాద్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బతుకమ్మ శోభ ఉట్టిపడింది. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శివాజీ నగర్ లో జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలతో మహిళలతో సరదాగా ముచ్చటించారు మంత్రితో సెల్ఫీలు దిగడానికి పిల్లలు మహిళలు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మన సంస్కృతి సంప్రదాయాలు మరింత ముందుకు తీసుకెళ్ళేలా సామూహికంగా బతుకమ్మ ఆడుతూ పూలను పూజిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.


