ఎంబిబిఎస్ విద్యార్థినికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సాయం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మెడికల్ సీటు సాధించి హాస్టల్ ఫీజు కట్టలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న హుస్నాబాద్ మండలానికి చెందిన విద్యార్థినికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సహాయం అందించి చదువు కొనసాగించేందుకు బాటలు వేశారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజి లో మెడిసిన్ సీటు సంపాదించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండా కి చెందిన లావణ్య రమేష్ లక్ష్మి దంపతుల రెండవ కుమార్తె లావుడ్య దేవీ హాస్టల్ ఖర్చుల నిమిత్తం లక్షా యాభై వేల రూపాయల చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కెడం లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.