భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివారులో గల బ్రిడ్జి భారీ వర్షాల వల్ల ధ్వంసం కావడంతో గురువారం ఆరోగ్య వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్రిడ్జిని క్షేత్రస్థాయిలోసందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి.ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నందిగామలో వరద తాకిడికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బ తినడం జరిగిందనిబ్రిడ్జి పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలను విధ్వంసమైన రోడ్లను పరిశీలించి త్వరితగతిన పంటలకు నష్టపరిహారం దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. వర్షాల వల్ల హిందూ దెబ్బతిన్న వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతారావు,తాజా మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి, మండల అధ్యక్షుడువెల్దుర్తి వెంకటేష్ గౌడ్,ముత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల బాలయ్య,బాజా రమేష్,నందిగామ గ్రామ అధ్యక్షులు అంజిరెడ్డి,కొమ్మట బాబు, శ్రీనివాస్,సుధాకర్,రిషికేష్, ఆంజనేయులు,దేమే యాదగిరి,అల్లాడి వెంకటేష్, ఏనిశెట్టి అశోక్,సిద్ధ రాములు,తదితరులు ఉన్నారు.
Posted inతెలంగాణ
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ





