వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ
ఇప్పటికే జిల్లాకు కోటి రూపాయలు వరద సహాయం
అత్యధిక నిధుల మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
హవేలీఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బాధితులకు పరామర్శ
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు నిర్వహణ, ఆర్మీ
బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి ఉన్నాయి
భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న
రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జెస్ తాత్కాలికి మరమ్మతులు చేపట్టాం.
ప్రజలు అధైర్య పడవద్దు పాలనయంత్రాంగం అండగా ఉంది
రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు
గడ్డం వివేక్ వెంకటస్వామి
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం
సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి ఆగస్టు 28
వరద బాధితులను అన్ని విధాల ఆడుకుంటామని వరద సహాయక చర్యలపై ఇప్పటికే కోటి రూపాయలు మంజూరు చేశామని అత్యధిక నిధుల మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర శాఖల జిల్లా అధికారులతో మెదక్ జిల్లా భారీ వర్షాలు వరదలు సహాయక చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ద్రోని వలన మెదక్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు 40 సంవత్సరాలలో మెదక్ జిల్లాలో
ఇంత మేరకు అత్యధిక భారీ వర్షపాతం చూడలేదన్నారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వరదల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వరద నీరు చేరి బిల్లింగ్ పైకి చేరుకున్న ప్రజలను హెలికాప్టర్ ద్వారా తరలించాలని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు గారు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వాతావరణ ప్రతికూల ప్రభావంతో హెలికాప్టర్ వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు నిమగ్నమై వారిని పునరావస్ కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు. ఏ సమయంలోనైనా మెదక్ జిల్లాకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లా అధికారులు సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతామని వివరించారు.
అనంతరం ఇరిగేషన్ వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల వారీగా వరద నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలోజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రకృతి విపత్కర పరిస్థితిలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.మెదక్ జిల్లా భారీ వర్షాలు వరద ఉధృతిపై హవేలి ఘనపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుందని
అత్యధికంగా 300 మిల్లీమీటర్లు మీటర్స్ వర్షపాతం నమోదయిందని తెలిపారు. పాపన్నపేట నిజాంపేట్ శంకరంపేట్, రామాయంపేట మండలాల్లో 200 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది అన్నారు. ఎస్డిఆర్ఎఫ్ (03) బృందాల సిద్ధంగా ఉన్నాయని, 40 మంది ఆర్మీ బెటాలియన్ రంగాల్లో ఉందన్నారు, రామాయంపేటలో వరద ఉధృతి వలన మిషన్ భగీరథ పైప్లైన్ డ్యామేజ్ అవ్వడం జరిగిందని వెంటనే పునరుద్ధరించడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ , రోడ్ల భవనాల శాఖ,ఇరిగేషన్ వరద నష్టాలను శాఖలు. తాత్కాలిక మరమ్మత్తులపై దృష్టి సారించారని, వరద ఉధృతి తగ్గిన వెంటనే . శాశ్వత మరమ్మత్తులపై చర్యలు చేపడతామన్నారు. ఆర్డీవోలుమండల ప్రత్యేక అధికారులు, పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు నిమగ్నమై ఉందన్నారు అనంతరం మంత్రివర్యులు పునరావాసకేంద్రాలలో ప్రజల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు, హెల్త్ క్యాంపును సందర్శించి ఎటువంటి అనారోగ్య పరిస్థితి తలెత్త కుండా చికిత్సలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు





