బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి

మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రజతోత్సవ సభ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ…  నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యా యాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలం గాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిం దన్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలు పెరుగని పోరాటాలు చేసిందన్నారు. మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని కదిలించిం దన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలం గాణ పునర్‌ నిర్మాణంలో భాగంగా టీఆర్‌ ఎస్‌, బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవిం చిందన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మ కమైన మార్పులు తీసుకువచ్చిందని, రైతు లకు, బడుగు, బలహీనవర్గాలకు, దళి తులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న BRS పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్‌ గారు తెలంగాణ ప్రజలకు భవిష్యత్‌ గుర్తించి దిశా నిర్దేశం చేయనున్నారని, ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం లోని ప్రజలు , పార్టీ కార్యకర్తలు హాజరై 27 నా జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *