నిరుద్యోగులకు అలర్ట్: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రేపు హుస్నాబాద్ లో “మెగా జాబ్ మేళా”
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ మెగా జాబ్ మేళా..
రేపు 24న సోమవారం ఉదయం 10 గం.ల నుండి హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో యువజన సర్వీసుల శాఖ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. 60 కి పైగా కంపెనీలు 5000 కు పైగా ఉద్యోగాలు కల్పించే ఈ జాబ్ మేళాకు 0 నుండి పీజీ వరకు విద్యార్హత ఉన్నవారు అందరూ అర్హులేనని అన్నారు. ఈ జాబ్ మేళా హుస్నాబాద్ నియోజకవర్గం లోని యువతకు ఓ సువర్ణ అవకాశమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.