సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈనెల 24న మెగా జాబ్ మేళా
జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని సిద్దిపేట రోడ్ లో గల తిరుమల గార్డెన్లో ఈనెల 24న ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యే అయి నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిగా ప్రభుత్వం తరపున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువురాని వారి నుండీ ఇంజనీరింగ్, పీజీ ల వరకు అక్కడకి రండి..వారికి అవసరమైన ఉద్యోగాలలో తీసుకుంటారు. మంచి నైపుణ్య ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశాల్లో ఉండే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ మెగా జాబ్ మేళా TGSTEP నిర్వహణలో 60 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని , 5000 పైగా ఉద్యోగ అవకాశాలు, అర్హత (0 – PG), మరియు ఏమీ చదువుకోని వారు కూడా అర్హులే, వయసు – 18 – 35 సం. ఈ మెగా జాబ్ మేళాలో ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు కింద ఇచ్చిన లింకులో మీ వివరాలు నింపి హాజరు కాగలరని నిర్వాహకులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ కొరకు
రిజిస్ట్రేషన్ ఫారం – మెగా జాబ్ మేళా – 24- జూన్ 2024
https://forms.gle/aWH1uo5poS6RrT3D6
Timing 10 am to 4 pm
వేదిక : తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ,హుస్నాబాద్
లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్స్:
https://maps.app.goo.gl/133dcrLap4Hi64q4A
Helpline Numbers –
6300610339,9642333667
