ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
పునరుద్ధరణకు త్వరలోనే చర్యలు
*సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28*
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో భారీ వర్షాలకు ధ్వంసమైన బ్రిడ్జిని గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్రిడ్జిలు కూలిపోయాయని నేషనల్ హైవే రీజినల్ ఆఫీసర్ కృష్ణ కాంత్ తో మాట్లాడమని వారు తమ సిబ్బందితో కలిసి ధ్వంసమైనటువంటి రోడ్లను పరిశీలిస్తున్నారన్నారు.వరద ఉదృతి తగ్గిన వెంటనే ఈ పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మించాలని ఆదేశాలు జారీ చేశామని.ఢిల్లీకి నితిన్ గడ్కరి కార్యాలయానికి ప్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించామన్నారు.ఈ సమయంలో గ్రామ యువకులంతా ప్రమాదంలో ఉన్న వారికి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి,ఆర్ ఐ లు ప్రీతి,హిమాద్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి,బిజెపి జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ , మండల అధ్యక్షులు చంద్రశేఖర్,శ్రీనివాస్,నరేష్ మహంకాళి, సిద్ధరాంరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Posted inమెదక్
ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు





