రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్ సంతాప సందేశం
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
నా మార్గదర్శి, మకుటంలేని మహారాజు, ఏనాటికానాడు ఈనాడు, తెలుగు నుడికారంలో అన్ని యాసల ప్రయోగ ప్రయోక్త, చేతలతో చైతన్యం నింపిన చెరుకూరి, పొలాల్లో ఏరువాక, సెలయేళ్ళలో మృగశిర కార్తె, భారత పద్మ విభూషణుడు,అనితర సాధ్యమైన లక్ష్యాలను తానే ప్రోదిచేసుకుని, గెలిచితీరిన విలుకాడు, కలం కార్మికునిగా నన్ను తొలిసారి పరీక్షించి, ప్రయోజకున్నని నమ్మి కొలువిచ్చిన యజమాని,నా అంచెలంచెల ఎదుగుదలను గమనిస్తూ ముచ్చటపడిన మా పెద్ద శ్రీ రామోజీ రావు అస్తమయం తీరని వెలితి. కిరణ్ కి, వారి విశాల కుటుంబానికి ప్రగాఢ సంతాపం. వారి ఎడబాటు విషాదం నేనూ అనుభవిస్తున్నాను. రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి కోసం పరమాత్మకు వేడుకోలు.