రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించింది.
రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్
యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్
చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య
హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు
అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్
టీపీటీఆర్ఐ డీజీగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియా
ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్న సందీప్
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి
జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి