విశాల షాపింగ్ మాల్ లో భారీ మోసం..
బంగారు కాయిన్ పేరిట కాగితం..
కంగుతిన వినియోగదారులు.. ఆందోళన
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, మార్చ్ 18
సిద్దిపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన విశాల షాపింగ్ మాల్ లో భారీ మోసం వెలుగు చూసింది. షాపింగ్ మాల్ ప్రారాంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు పలు
ఆఫర్లు ప్రకటించి షాపింగ్ మాల్ యాజమాన్యం కస్టమర్లకు కుచ్చుటోపి పెట్టింది. నిలువు దోపిడికి పాల్పడింది. ఐదు వేల రూపాయల పైన కొనుగోలు చేసిన వినియోగదారులకు బంగారు, వెండి కాయిన్లు అంటూ ప్రకటించడంతో వినియోగదారులు ఎగబడి షాపింగ్ చేశారు. తీరా షాపింగ్ మాల్ యజమాన్యం ఇచ్చిన బంగారు, వెండి కాయిన్ లు ఇంటికి వెళ్లి చూస్తే కాగితంఅని తేలడంతో వినియోగదారులు కంగుతిన్నారు. షాపింగ్ మాల్ వచ్చి ఇదేంటని షాపింగ్ యాజమాన్యాన్ని నిలదీస్తే మరోసారి షాపింగ్ కు రాకండి.. అంటూ చెపుతూ యాజమాన్యం చేతులు దులుపుకుంటుంది. ఎగబడి కొనుగోలు చేసిన వినియోగదారులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




