కర్నూలులో ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సుn(DD 01 AN 9190) డ్రైవర్ గమనించి, వెంట ఉన్నా మరో డ్రైవర్‌ను నిద్రలేపి, చిన్న ప్రమాదమని భావించి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా మంటల్లో దిగ్ధమైంది. మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణినులను నిద్రలేపారు. ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు. ప్రమాదం తర్వాత హైవేపై వెళ్తున్నవారు సహాయం చేశారు. కర్నూల్ జిజిహెచ్ లో కొందరు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం. డ్రైవర్, స్పేర్ డ్రైవర్‌ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై ఇద్దరిని విచారిస్తున్నారు.





