హుస్నాబాద్ లో చెన్నూరు సమ్మయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో అప్పుల బాధతో చెన్నూరు సమ్మయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన మృతుడు సమ్మయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేయగా, మరో కుమార్తెకు, కుమారుడికి ఇద్దరికీ రే చీకటి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
