ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన డిసిసి చైర్మన్ డా.సంతోష్ కుమార్

సిద్దిపేట టైమ్స్,చేర్యాల:

అవగాహన లేని వైద్యం ఆర్ఎంపీలు చేయకూడదని జనగామ జిల్లా మెడికల్ &హెల్త్ వింగ్ డిసిసి చైర్మన్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్థానిక ఆర్ఎంపి వైద్యం చేయడం వల్ల వికటించి వ్యక్తి చెందారు.మృతి చెందిన బాధిత కుటుంబానికి జనగామ జిల్లా డిసిసి డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ సంతోష్ కుమార్  రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్ లు ప్రధమ చికిత్స చేయాలి తప్ప ఎలలాంటి వైద్యం చేయకూడదని, ఇష్టం వచ్చినట్లు వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటలాడకూడదని తెలిపారు. జనగామ పట్టణానికి చెందిన వ్యక్తి ఆర్ఎంపి ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక నిండు ప్రాణం కోల్పోయారని, ఆర్ఎంపీల ప్రథమ కర్తవ్యం ప్రధమ చికిత్స చేసి రోగికి అవసరమైన వైద్య సూచనలు ఇవ్వాలి తప్ప తన సొంత ఆలోచనలతో వైద్యం చేయకూడదని అన్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి డిసిసి డాక్టర్ సెల్ తరఫున రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ సింగపాక కుమార్, డాక్టర్ సెల్ జనగామ జిల్లా కార్యదర్శి కందుకూరి హరీష్, కొడకండ్ల మండల ఇంచార్జి ఉప్పుల అనిల్ కుమార్, దేవరుప్పుల మండల ఇంచార్జి సంగి నాగరాజు, డీసీసీ డాక్టర్ సెల్ సోషల్ మీడియా ఇంచార్జి బడుగు శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *