హుస్నాబాద్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన హుస్నాబాద్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్లో నివసిస్తున్న పోలు సమ్మయ్య (45)పట్టణంలో హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం యధావిధిగా పనికి వెళ్లి వచ్చిన అనంతరం భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా తీవ్ర మనస్తాపం చెందాడు. ఎప్పుడు ఇలానే అంటూ ఉండేవాడు కదా అని భార్య అనుకుంది. అందరూ పడుకున్న తర్వాత రాత్రి ఇంటి బయట ఉన్న పిల్లర్ యొక్క ఇనుప చువ్వలకు తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. తెల్లవారి భార్య లేచి చూసేసరికి ఉరి వేసుకుని చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.