అప్పుల బాధతో  ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో  ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో  ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(మార్చ్,01):

అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్న సంఘటన  ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  గ్రామానికి చెందిన నలగోప్పుల నర్సిములు(58) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన శనివారం అర్ధరాత్రి 2:40 గంటలకు ఇంట్లో నుండి బయటికి వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తన చిన్న కుమారుడు  హేమంత్ ఉదయం 5:30 గంటలకు వెతుక్కుంటూ వెళ్లగా గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో చెట్టుకు ఊరి చేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండడం చూసి పోలీసులకు,కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో మృతుని పెద్ద కుమారుడు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండి అసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *