సిద్దిపేట టైమ్స్, మద్దూరు (అక్టోబర్, 16):
మద్దూరు మండలం గాగిళ్లపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఎలూరి రామకృష్ణ (37) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ తన ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Posted inమద్దూరు
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య





