బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయండి
రేపు హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష
బీసీల హక్కుల సాధనకై హుస్నాబాద్ బీసీ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ పిలుపు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “ధర్మ పోరాట దీక్షలు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ బీసీ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ, బీసీల రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈనెల 13వ తేదీ అనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగనుందని పేర్కొన్నారు.
“బీసీలకు సమాన హక్కులు, ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ ధర్మ పోరాటం కొనసాగుతుంది. ఇది పార్టీ రాజకీయాలకు అతీతమైన సామాజిక ఉద్యమం,” అని ఆయన స్పష్టం చేశారు. బీసీ జేఏసీ, బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





