మైనంపల్లి రోహిత్ లేదా బల్నూర్ వెంకట్ కు మంత్రి పదివి..?
యూత్ కోటాలో అవకాశం..!
డిల్లీకి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు..
సిద్దిపేట టైమ్స్ :మెదక్ ప్రత్యేక ప్రతినిధి ;
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కు మంత్రి వర్గంలో చాన్సు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ఆకస్మికంగా డిల్లి వెళ్లారు. ప్రత్యేకంగా హైదరాబాద్ కోటాలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. లేదా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట తో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి సైతం మంత్రివర్గంలో అవకాశం కలిపిస్తారని ప్రచారం జరుగుతుంది. యూత్ కోటాలో మైనంపల్లి రోహిత్ రావు లేదా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. జులై 1,2, తేదీలలో మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తొంది.