ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా పథకం
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:
దసరా పండుగ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించింది. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్. వెంకన్న వివరాలు తెలియజేస్తూ, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి మరియు అన్ని ఏసీ బస్సులలో ప్రయాణించే వారు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని తెలిపారు.
ప్రయాణికులు తమ టికెట్‌పై పేరు, ఫోన్ నంబర్, చిరునామా వ్రాసి ఆయా బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన బాక్సులలో వేసి పాల్గొనవలసి ఉంటుంది. అక్టోబర్ 8న సాయంత్రం 4 గంటలకు జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో డ్రా నిర్వహించబడుతుంది. ప్రతి ప్రాంతం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. విజేతలకు 25,000 రూపాయలు (మొదటి బహుమతి), 15,000 రూపాయలు (రెండవ బహుమతి), 10,000 రూపాయలు (మూడవ బహుమతి) నగదు బహుమతులు అందజేయబడతాయి. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ సూచించింది.
Posted inహుస్నాబాద్
ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా పథకం





