డివైడర్ను ఢీకొని లారీ బోల్తా… తప్పిన పెను ప్రమాదం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఎల్కతుర్తి రామాయంపేట జాతీయ రహదారిపై హుస్నాబాద్ పట్టణం లోని బస్టాండ్ ఎదురుగా డివైడర్ను ఢీకొని లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. సోమవారం అర్ధరాత్రి భూపాలపల్లి జిల్లా పరకాల నుండి సంగారెడ్డి జిల్లా పేపర్ మిల్లుకు ఉనకలోడుతో వెళ్తున్న లారీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కారును తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రహదారిపై అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు. పట్టణంలో జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కూడల్లలో త్వరితగతిన రహదారి విస్తీర్ణ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.





