స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి..ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి..ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి..కలసికట్టుగా పనిచేయండి….
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్
హాజరైన మంత్రులు దామోదర్ రాజనర్సింహ
పొన్నం ప్రభాకర్..
దీపా దాస్ మున్షీ
అసెంబ్లీ, పార్లమెంట్ కు
పోటీ చేసి ఓడిపోయిన నేతలు….పాల్గొన్నారు.

సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ,పొన్నం ప్రభాకర్ ,దీపా దాస్ మున్షీ
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, ఆంజనేయులు గౌడ్ పీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామ్ చందర్ గౌడ్,మద్దుల సోమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా లో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో నీ నేతలు సమన్వయంతో పనిచేయాలనీ సూచించారు. జిల్లా,మండల,గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తల ను గౌరవించాలని పీసీసీ చీఫ్ సూచించారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బల పరిచిన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేసారు.

25 సంవత్సరాల కు మెదక్ నియోజక వర్గంలో…కాంగ్రెస్ జెండా..

మెదక్ నియోజకవర్గంలో 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మెదక్,సిద్దిపేట,నర్సాపూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామ్ చందర్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు.
కష్ట పడ్డ కార్యకర్తలను అధిష్టానవర్గం గుర్తించాలని సూచించారు.ఆయా నియోజక వర్గాలనుండి ముఖ్య నేతలు మాట్లాడారు. సిద్దిపేట,గజ్వేల్,నర్సాపూర్,మెదక్,ఆందోల్,సంగారెడ్డి,జహీరాబాద్, నారాయణఖేడ్, దుబ్బాక, పటాన్చెరు,తదితర నియోజక వర్గాలనుండి పీసీసీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *