పట్టభద్రుల గొంతుక వినిపించాలంటే ఎమ్మెల్సీ గా ప్రసన్న హరి ని గెలిపించుకుందాం….
హుస్నాబాద్ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ వచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజాంబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ వేసిన సందర్భంగా హరికృష్ణకు మద్దతుగా హుస్నాబాద్ నియోజకవర్గ బిసి సంఘాల పక్షాన నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సోమవారం కలిసి తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులో విద్యకు 20 శాతం నిధులు కేటాయించ వలసి ఉన్న కేవలం ఆరు ఏడు శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ రంగాలలో విద్యను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని. రాష్ట్రంలో, దేశంలో ఒకవైపు నిరుద్యోగ శాతం పెరుగుతుందని. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న పట్టభద్రులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. ఉద్యోగులకు సంబంధించి సరైన టైమ్ కు D A లు ఇవ్వకుండా, రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయకుండా, సిపిఎస్ స్కీమ్ నే ప్రభుత్వం కొనసాగిస్తుంది. పట్టభద్రుల గొంతుక శాసనమండలిలో వినిపించాలంటే విద్యావేత్త మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణని గెలిపించుకుందామని బిసి సంక్షేమ సంఘం పక్షాన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.