పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపిద్దాం
నియోజకవర్గ దళిత, బహుజన సంఘాల నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పట్టభద్రుల ఎన్నికలలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం రోజున హుస్నాబాద్ లోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రసన్న హరికృష్ణ గౌడ్ విజయం కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ ఏకం కావాలని అన్నారు. అగ్రవర్ణాలకు, అణగారిన వర్గాలకు జరుగుతున్న పోరాటంగా ఎన్నికలను గుర్తించాలని అన్నారు. విద్యా వ్యాపార రంగాలలో కోట్ల రూపాయల దండుకున్న దళారులు ఓట్ల కోసం తిరుగుతున్నారని, పట్టభద్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అపార విద్యావేత్తగా, జ్ఞానిగా పేరుపొందిన ప్రసన్న హరికృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు కోయడ కొమురయ్య, దళిత సంఘాల నాయకులు లింగాల సాయన్న కండ సుధాకర్, అరసం రాష్ట్ర సభ్యులు వడ్డేపల్లి మల్లేశం, బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మారపల్లి సుధాకర్, తాళ్లపల్లి వెంకటేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్ల వెంకటస్వామి మాదిగ, మొలుగూరి సునీత మాదిగ, డా. పోలు సుధాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






Prasanna harikrishna MLC Bc vote for phk MLC 100% win