జోహార్ తెలంగాణ అమరుల కు జోహార్లు.
అమరుల ఆశయాలను సాధిద్దాం.
హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆదివార హుస్నాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, పూల తో నివాళుల అర్పించింది. ఈ సందర్భంగా JAC హుస్నాబాద్ నియోజకవర్గం కోఅర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అంబేద్కర్ చౌరస్తా లో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జయ జయహే అందేశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతం గా ఆవిష్కరణ చేయడం శుభపరిమాణం అన్నారు. JAC కన్వీనర్ కవ్వ లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయడానికి విచ్చేసిన ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలియచేసారు. కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. హైదరాబాద్ లో జరిగే ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు బస్ లో 40 మంది ఉద్యమకారులు బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమం గోడిశాల శ్రీనివాస్ సహకారం లో జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
