సిఎం vs కేటీఆర్…రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం..
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో గొంతు వినిపిద్ధామని అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాల్ చేసుకున్నాయి.
కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో దీక్ష చేయాలని.. అందుకు ప్రతిపక్ష పార్టీగా తాము కూడా మద్దతు ఇస్తామన్నారు.
కేటీఆర్ ఎన్ని రోజులైనా దీక్షకు సిద్ధమని, కేబినెట్ మంత్రుల చుట్టూ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కూర్చుంటామన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దామంటూ కేటీఆర్ విరిసిన సవాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి కూడా సై అన్నారు.
దీక్షకు కేసీఆర్ కూడా రావాలని ప్రతిపక్ష నేతగా కేసీఆర్, సీఎంగా రేవంత్ రెడ్డి తాను దీక్షకు రెడీ అంటూ ప్రతి సవాల్ చేశారు. రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం అన్నారు రేవంత్ రెడ్డి…
Posted inతాజావార్తలు తెలంగాణ
రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం..
