వీరుల పోరుబాటలో సాగుదాం…
దొడ్డి, గడిపె కొమురయ్యల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ...
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి, 40 ఏడ్లపాటు హుస్నాబాద్ లొ సమాజ సేవ చేసిన ఏది ఆశించని నిస్వార్థ సేవకుడు సిపిఐ నాయకులు గడిపె కొమురయ్య 3వ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన చిత్రా పటాలకు సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ పుల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దొడ్డి, గడిపె కొమురయ్యల వర్ధంతి సందర్భంగా గడిపె మల్లేశ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తోలి అమరుడు కడవెండి కన్నబిడ్డ దొడ్డి కొమురయ్య ఆశించిన పేదల రాజ్యం రాలేదని దేశంలో ఇంకా దొపిడి పాలన కొనసాగుతుందని పేదల రాజ్యం స్థాపన కోసం నేటి యువత ముందుకు రావాలని సమాజ మనుగడ కోసం స్వచ్చందంగా పనిచేసిన దొడ్డి, గడిపె కొమురయ్యల త్యాగాల బాటలో పయనించాలని గడిపె మల్లేశ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్ చారి,
భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకురాల్లు మెదిని లక్ష్మి, పోగుల నవ్య, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, కొలుగురి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.