తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం….రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రతి పౌరుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ…. జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలు గా జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తరువాత ప్రజలు కోరుకున్న , ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది అని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అని, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని, తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కోరుతూ, అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *