‘పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ప్రసన్న హరికృష్ణను గెలిపించండి’
హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న పులి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ కోరారు. బుధవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఆరోగ్యభద్రత గురించి ప్రశ్నించే గొంతులను చట్టసభలకు పంపాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రసన్న హరికృష్ణ తనకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి, ఇంకా 19 సంవత్సరాలు సర్వీస్ ఉన్న, విద్యారంగంలో ఉన్న సమస్యలపై కొట్లాడేందుకే పోటీ చేస్తున్నారని, హరికృష్ణ ఉన్నత విద్యావంతులు, బీసీ సామాజిక వర్గం కు చెందిన వారని, గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులకు తను అందించిన మెటీరియల్ ద్వారా మరియు కోచింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి సహాయం చేశారని, తెలంగాణ శాసన మండల కి ఎటువంటి ప్రజాసేవ చేయని వారు ఓట్లను కొనుగోలు చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని, ప్రధాన పార్టీలకు సంబంధించి ఎన్ని డబ్బులు ఇచ్చిన పట్టభద్రులు తీసుకుని, ఇటువంటి సేవ భావం ఉన్న నాయకులను గెలిపించు కోవాల్సిందిగా పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యకు అరకొర నిధులు కేవలం ఏడు శాతం మాత్రమే కేటాయించిందని, రాష్ట్రంలో విద్యాలయాలు బాగుపడాలంటే బడ్జెట్లో పదిహేను శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రైవేటు రంగాలలో ఉద్యోగుల భద్రత, ఆరోగ్య భద్రత మెరుగు పడాలంటే ప్రశ్నించే గొంతులను చట్టసభలకు పంపాలని బీసీ సంఘాల పక్షాన కోరారు. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గ పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, మరియు ఓసి వర్గాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, అరసం రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి మల్లేశం, కళ్ళు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోహెడ కొమురయ్య, బీసీ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్, హుస్నాబాద్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు కన్నోజు చొక్కా చారి, హుస్నాబాద్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు పూదరి రవీందర్ గౌడ్, ముంజ నారాయణ, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.