పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ని గెలిపించండి.
బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోడపట్ల ఈశ్వర్..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట అర్బన్
బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో జరిగిన పార్టీ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోడపట్ల ఈశ్వర్ హాజరై మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతోమంది పేద విద్యార్థులకు నిరుద్యోగులకు బాసటగా నిలిచి నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్న ప్రసన్న కృష్ణ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించాలని ఈ సందర్భంగా ఈశ్వర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి యాదగిరి, జక్కుల వెంకట్, జిల్లా ఇంచార్జ్ డేగల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ , దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షుడు పోతారం రాజు, సిద్దిపేట అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సంపత్ పంగా బాబు, మొండి కరుణాకర్, సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షుడు కర్రె హరికిరణ్, జరిపోతుల రవీందర్ స్థానిక బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.





