Breaking: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు

Breaking: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు

మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటీసులు

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్న వ్యాఖ్యలను మంత్రి  సీరియస్‌గా తీసుకుని నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.

ఎన్టీపీసీ ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ ఛానెల్ , టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్,నమస్తే తెలంగాణ దినపత్రిక, పార్టీ చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి , తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లకి లీగల్ నోటీసులు జారీ చేసిన అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు.

ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించుకోవడానికి వీలుండదు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా  సప్లై చేస్తారు. ఈ ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీ కి ఉపయోగిస్తారు.
ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి  వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది.

ఫ్లై యాష్  ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి పై ఆరోపణలు చేశారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని ప్రతి లారికి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారు. ఫ్లై యాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయి. అది అధికారులు చూసుకుంటారు.అది పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుంది. అది టెండర్ ద్వారా  ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు.

కానీ వ్యక్తిగత కక్ష తో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గానూ మంత్రి తన అడ్వకేట్ పూర్ణచందర్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు జారీ చేశారు. అది ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్ తో పాటు నమస్తే తెలంగాణ దిన పత్రిక కు కూడా ఈ లీగల్ నోటిసులు పంపించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *