బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు
పట్టణ ప్రజలందరూ చెత్త విభజనకు సహకరించాలి
హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మల్లికార్జున్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజు 1, 3 వ వార్డులలో చెత్త విభజన పై జరిగిన అవగాహన కార్యక్రమాలలో పురపాలక సంఘం కమిషనర్ టీ మల్లికార్జున్ పాల్గొని మాట్లాడుతూ… పట్టణ ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్తగా వేరుచేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని, ప్రస్తుతం 40% ఇంటి యజమానులు చెత్తను వేరు చేసి ఇస్తున్నారని, 100% కావాలంటే పట్టణ ప్రజలందరూ చెత్త విభజనకు సహకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, బహిరంగంగా చెత్త వేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు వెంకటేష్, సాంబరాజు, సత్తార్, వెంకటేష్, బసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్,వార్డ్ ఆర్పీలు, జవాన్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.