బిసి సంక్షేమ సంఘం, రైతు ఐక్యత సంఘం, రాష్ట్ర గీతా కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యుడు, హుస్నాబాద్ కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వివిధ సంఘాల ఉద్యమ నాయకుడు “పచ్చిమట్ల రవీందర్ గౌడ్” బీఎస్పీ పార్టీలో చేరిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకన్న, బిఎస్పి జిల్లా అధ్యక్షులు కటికల ఓం ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందల్ శంకర్, జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి కొండనల్ల నరేష్, సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు బీఎస్పీ పార్టీ పూలే అంబేడ్కర్ సిద్ధాంతాలకు ఆకర్షతుడై బిసి సంక్షేమ సంఘం, రైతు ఐక్యత సంఘం, రాష్ట్ర గీతా కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యుడు, హుస్నాబాద్ కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు వివిధ సంఘాల ఉద్యమ నాయకుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బీఎస్పీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు సేవ చేసేందుకు బీఎస్పీ పార్టీ ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో గెలుపు కొరకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు పురపాలక సంఘ ఎన్నికలలో హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం బిఎస్పి పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు బీఎస్పీ నాయకులు, శరత్, కొండనోళ్ల నరేష్, సీనియర్ నాయకులు జేరిపోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.