బీసీ సంక్షేమ & రైతు ఐక్యత సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ సర్వేయర్ ను సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని ప్రభుత్వ భూములకు సంబందించి కబ్జాలు జరుగుతున్న విషయం గురించి గత 2 సంవత్సరం ల నుండి MRO కి ఎన్నో సార్లు పిర్యాదు చేసాము. MRO లు, సర్వయర్ లు మారుతున్నారు కానీ ఈ సర్వే నంబర్లు 12, 921 కొలచి భూములపై చర్యలు తీసుకోవడం లేదు. హద్దులు నిర్ణయించాలని అఖిలపక్షాలు కోరిన సర్వేయర్ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు సర్వేనెంబర్ 12 లో కోట్ల విలువ చేసే ఎకరం భూమి అన్యాక్రాంతం అవుతుంది. 921 సర్వే నంబర్లు లో ఆరు ఎకరాలనర భూమి ఉంటే 1, ఎకరంనర భూమి కబ్జా అయింది. గతంలో 627 సర్వేనెంబర్ లో రెండు ఎకరాల భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమి అని ఎవరు కొనుగోలు జరప వద్దని ఎమ్మార్వో వాణి అట్టి భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ భూమి కూడా ఈ రోజు కనబడుటలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ భూములకు కాపలా ఉండవలసిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాజకీయ నాయకుల అండతోనే సర్వేయర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు.
