కోహెడలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఈ సీ మెంబెర్ అర్శనపల్లి జయకృష్ణ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలు కోహెడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు అన్నారు. తెలంగాణ సాధన కోసం అప్పటి ఏడవ నిజాం నవాబు రజాకార్లతో పోరాటం చేసిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీ కే దక్కిందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల మేరకు బీసీ సమాజమంతా ఆయన ఆశయ సాధనం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి కొండబత్తిని రాజలింగం, గోవిందు సురేష్, గోవిందు సునీల్, నరాల అశోక్, మెరుగు కనకయ్య, కొండబత్తిని సతీష్, వడ్డేపల్లి, రాజేంద్ర ప్రసాద్, వడ్డేపల్లి రామకృష్ణ, ఆకుబత్తిని మల్లేశం, మేర నారాయణ మరియు గ్రామ ప్రముఖులు పెర్యాల రాజేశ్వర్ రావు, డాక్టర్ వేల్పుల శంకర్, మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు