పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నిన్న రాష్ట్ర మంత్రివర్గంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం శుభ సూచకమని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ జన్మదిన దినోత్సవం సెప్టెంబర్ 27న రాష్ట్ర పండుగ నిర్వహించడం ఆనంద దాయకమని పేర్కొన్నారు. అదే విధంగా వచ్చే సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నాటికి హుస్నాబాద్ పట్టణంలో వారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలి సంఘం నేతలు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కోయడ కొమరయ్య, పద్మశాలి సంఘం నాయకులు బూర్ల రాజయ్య, గాజుల భగవాన్, వడ్డేపల్లి వెంకటరమణ, వడ్డేపల్లి బాలయ్య, వడ్డేపల్లి రాజేశం, గుత్తికొండ వేణు మాధవ్, కొండ సత్యనారాయణ, అఖిలపక్ష నాయకులు, పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.