గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..

సిద్దిపేట టైమ్స్, ఖైరతాబాద్:

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని  బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు.
ఇక ఈ ఉదయం 7 గంటలకు బడా గణేశ్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్ పూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్ మార్గ్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *