జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ

ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం విపంచి ఆడిటోరియంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి తో లైబ్రరీ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి ని మంత్రి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లింగమూర్తి కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తి సిద్దిపేట కి మంచి పేరు తెచ్చేలా పని చేయాలన్నారు. రాష్ట్ర మంత్రిగా నా నియోజకవర్గంలో రెండు మండలాలు కరీంనగర్ రెండు హన్మకొండ, మూడు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. రెండో దశలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడికి వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతా అని అన్నారు. మూడు నియోజకవర్గాల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక లో స్థల సేకరణ చేయండి అని అన్నారు. గ్రంథాలయం లు పారదర్శకంగా పని చేయాలని నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడానికి విషయ సంగ్రహణ చేయాలని ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొత్త చైర్మన్ లను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించిన తెలంగాణ మొత్తంలో సిద్దిపేట జిల్లా అధిక ఉద్యోగాలు సాధించాలి అని అన్నారు. ఈ ప్రజా పాలన లో అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని, గ్రామాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ అందిస్తున్నాం అని..ఎవరికైనా రాకపోతే అధికారులకు పిర్యాదు చేయండి. ఆరోగ్య శ్రీ అందిస్తున్నాం, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసి బస్సులో ఉచిత బస్సు, ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా కూడా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ పూర్తి తీశామని, 2 లక్షల పైన ఉన్న వారికి 2 లక్షల వరకు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ చేస్తున్నమన్నారు. గురుకులాల్లో హాస్టల్ లకు నిన్న 100 కోట్ల రూపాయలు అద్దె బకాయిలు చెల్లించామని అన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వందల కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు. విద్యా బోధన కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పేరు తో కాలేజీలు మూసి ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ స్కూల్ లకి ఉచిత విద్యుత్, శానిటేషన్ సిబ్బంది నియామకం, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కనిపిస్తున్నామని, ఉపాధ్యాయుల నియమకాలు చేపట్టి డీఎస్సీ ద్వారా పూర్తి చేసామన్నారు. 5 వేల కోట్లతో 29 స్కూల్ లకి ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు శంఖు స్థాపన చేశామన్నారు. లైబ్రరీ విద్యార్థి నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఉండాలని, వారికి ప్రత్యేక శిక్షణ అవసరం ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టడీ సర్కిల్ లో ద్వారా శిక్షణ ఇప్పించి ప్రతి నోటిఫికేషన్ లో ఈ జిల్లా ఉద్యోగాలు పొందడంలో ప్రథమ స్థానంలో ఉండాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి లు పూజల హరికృష్ణ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *