

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..
భవిష్యత్తు ప్రణాళిక పై చర్చ.. పలు అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచనలు..
సిద్దిపేట టైమ్స్, ప్రత్యేక ప్రతినిధి;
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం పలు అంశాలపై చర్చించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు టి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి ప్రకాష్ గౌడ్ లతోపాటు ఎమ్మెల్సీలు షేర్ సుభాష్ రెడ్డి, దండేవిటల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు కే మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపిన కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికపై సూచనలు సలహాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై చర్యలు, పార్టీ పటిష్టానికి చేపట్టవలసిన అంశాలపై చర్చించి నట్లు సమాచారం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు తదితర భవిష్యత్ ప్రణాళికలపై కేసీఆర్ సూచనలు చేశారు.
ఫోటోలు…
