భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారతరత్న ఇవ్వాలని సైకిల్ యాత్ర చేసిన సామజిక కార్యకర్త రాజుని అభినందించిన
– తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు కీ భారతదేశ అత్యున్నత పురస్కరం భారతరత్న ఇవ్వాలని గత పదేళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తూ, 2019లో వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసిన కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజుని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రి గా, ప్రధాన మంత్రిగా ఎన్నో పదవులను అలంకరించి దేశాన్ని అత్యున్నత, అభివృద్ధి దశలో తీసుకెళ్లిన మేధావులు పీవీ అని కేసీఆర్ అన్నారు. 1991లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1996వరకు ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన అపరచాణిఖ్యులు పివి అన్నారు.
భూసంస్కరణ చట్టాన్ని తెచ్చి భూమి లేని బడుగు బలహీన వర్గాలకు భూ పంపిణి చేసిన దార్షనీకుడు, దేశంలో విద్యావ్యవస్థలో విప్లవత్మాకమైన మార్పులు తెచ్చి నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశారని అన్నారు. తన జీవితకాలమంతా ప్రజాశ్రేయస్సుకే అంకితం చేసిన గొప్ప రాజానీతజ్ఞడన్నారు. తెలంగాణ మేధావుల ఆశయాల సాధన కై నిరంతరం పని చేస్తూన్నా రాజు స్పూర్తితో ప్రతిఒక్కరు దేశభక్తి భావాలు అలవర్చుకోవాలన్నారు.