కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి
మంత్రి మీద అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదు
హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీ.ఆర్.ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అబండాలు అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేసి కౌశిక్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆరోపణలు చేస్తున్నారని ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వల్లపు రాజు, సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్, పోతుగంటి బాలయ్య, సంఘ కుమార్, మార్క అనిల్, పచ్చిమట్ల శ్రీకాంత్, దుబల శ్రీనివాస్, బందెల హరీష్ బాబు, విక్రమ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు తెలంగాణ హుస్నాబాద్
కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి
